Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్ మొబైల్ గేమ్.. కానీ, అదే మృత్యువుకు రహదారి

బ్లూ వేల్ గేమ్. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు. ఈ గేమ్ సరదాగా మొదలవుతుంది. కానీ, ముగిసేసి మాత్రం మృత్యువుతోనే. ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఓ హిప్నాటిక్ గేమ్. రష్యాలో వందలమంది టీనేజర్లు బ

Advertiesment
జస్ట్ మొబైల్ గేమ్.. కానీ, అదే మృత్యువుకు రహదారి
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (09:23 IST)
బ్లూ వేల్ గేమ్. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు. ఈ గేమ్ సరదాగా మొదలవుతుంది. కానీ, ముగిసేసి మాత్రం మృత్యువుతోనే. ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఓ హిప్నాటిక్ గేమ్. రష్యాలో వందలమంది టీనేజర్లు బలయ్యారు. చూడటానికి జస్ట్.. ఓ మొబైల్ గేమ్‌ మాత్రమే. కానీ, 10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట లేత మనసులను దారుణంగా వేటాడేస్తుంది. ఇటీవలికాలంలో ఈ గేమ్ బారినపడి మృత్యువాతపడుతున్న సంఘటనలు అనేక. 
 
ఇందులో లీనమయ్యే యువతీయువకులు చేసే ప్రతి పనీ గేమ్‌లో భాగమని భావిస్తారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందీ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్. సముద్ర తీరానికి వచ్చి బ్లూవేల్స్ అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయి. అదే పేరును ఈ గేమ్‌కి పెట్టారు. పేరుకి తగ్గట్టుగానే దీని ఫైనల్ స్టేజ్ ఆత్మహత్యతో ముగుస్తుంది. 
 
ఈ గేమ్‌ ఆడే చిన్నారులు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగా మారిపోతారు. వారిని చిన్నపిల్లల్లా ఆడించినట్టల్లా ఆడించి చివరికి ప్రాణాలు హరిస్తుంది. భావోద్వేగాలతో ఆడుకుంటూ, పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది. ఈ ప్రాణాంతక క్రీడను రూపొందించిన సైకో డెవలపర్ ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టు చేసినా, ఆ ఆట అనేక కాపీ ప్రోగ్రామ్‌ల రూపంలో ఇంటర్నెట్‌లో వివిధ దేశాలకు విస్తరించింది. ఫలితంగా పోకెమాన్ స్థానంలో ఇపుడు బ్లూ వేల్ ఛాలెంజ్ వచ్చి చేరింది. సవాల్ విసురుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తి పేరుతో గుడికి... పెళ్లయిన 3 నెలలకే భర్తను హతమార్చిన భార్య