Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీని ఫ్లాటుకు రప్పించుకున్నాడు.. రేప్ చేసి ఆ వీడియోను ఆ సైట్లో అప్‌లోడ్ చేశాడు..

టెక్కీపై దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంచించి తోటి టెక్కీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా దాన్ని వీడియోగా చిత్రీకరించి.. పోర్న్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశాడు.

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (09:30 IST)
టెక్కీపై దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంచించి తోటి టెక్కీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా దాన్ని వీడియోగా చిత్రీకరించి.. పోర్న్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆరిందమ్ నాథ్(28) సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ బెంగళూరు నగరంలోని ఈజిపురా ప్రాంతంలోని వివేక్‌నగర్‌లోని ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల మహిళ బెంగళూరులో ఉంటూ ఆరిందమ్‌నాథ్‌తో కలిసి సాప్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. 
 
ఆరిందమ్ 26ఏళ్ల మహిళను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఓ రోజు ఫ్లాటుకు రమ్మని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని సెల్‌ఫోన్‌తో రహస్యంగా వీడియో తీశాడు. రేప్ వీడియోను పోర్న్ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ అనేక సార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆరిందమ్ రేప్ వీడియోను పోర్న్ సైట్‌లో పెట్టాడు.
 
దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరిందమ్ నాథ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 384, 506, 66 ఈ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత మహిళా టెకీ ఆత్మహత్యయత్నం చేయగా ఆమె స్నేహితురాళ్లు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం