Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌‌లో వున్నాను.. మీరు నాకు నచ్చారు.. రూ. 17.89 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేస్తే?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (18:29 IST)
మాయమాటలతో మోసపోతున్న అమాయకుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది.  తాజాగా మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన ఓ యువకుడిని ఓ మాయలాడి ఏకంగా రూ. 17.89 లక్షల మేర దోచుకుంది. అంత సమర్పించుకున్నాక కానీ తాను మోసపోయిన విషయం గుర్తించలేకపోయిన బాధిత యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన కుమార్ వధువు కావాలంటూ ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. అతడి ప్రొఫైల్ చూసిన ఓ యువతి కుమార్‌కు ఫోన్ చేసింది. 
 
ప్రొఫైల్‌తోపాటు మీరూ నచ్చారంటూ మాటలు కలిపింది. తాను వైద్యురాలినని, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నానని నమ్మబలికింది. త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానని, వచ్చాక పెళ్లి చేసుకుందామని ఊరించింది. ఆ వెంటనే యూకే వెళ్లిపోదామని, వద్దంటే హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరూ వాట్సాప్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటముచ్చట నిత్యకృత్యమయ్యాయి. 
 
ఈ క్రమంలో ఓ రోజు కుమార్‌కు ఫోన్ చేసిన యువతి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానని, వస్తూవస్తూ విలువైన బహుమతి తెస్తానని చెప్పింది. ఇంతలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో ఓ ఫోన్ వచ్చింది. యూకే నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత కరెన్సీలో దాదాపు కోటి రూపాయల విలువైన డబ్బు వెంట తెచ్చిందని చెప్పారు. అయితే, కస్టమ్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకపోవడంతో ఆమెను నిర్బంధించామని, ఆమె ఇచ్చిన నంబరు ఆధారంగా మీకు ఫోన్ చేశామని చెప్పారు.
 
వారు చెప్పింది విని ఆందోళన చెందిన కుమార్ తానేం చేయాలని అడగ్గా ఆమెను వదిలిపెట్టాలంటే రూ. 17.89 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో వెంటనే ఆ మొత్తాన్ని వారు చెప్పిన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన మరుక్షణం నుంచే అమ్మాయితోపాటు, ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పిన వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్ అవడంతో అనుమానించాడు. తాను మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంకు ఖాతా, నిందితుల ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments