Webdunia - Bharat's app for daily news and videos

Install App

1000 మందిని మోసం చేశాడు.. రూ.40-50కోట్ల వరకు స్వాహా?

Webdunia
గురువారం, 21 జులై 2022 (14:18 IST)
సోషల్ మీడియా ద్వారా నేరాల సంఖ్య పెరిగిపోతుంది. యువతులు, మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ బాగోతాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు అతడు 60 మందిని మోసం చేసి రూ.6 కోట్ల వరకు దోచుకున్నారు. 
 
పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డారు. వంశీకృష్ణ సుమారు 1000 - 1500 మందిని యువతులు, మహిళలను మోసగించి రూ.40-50 కోట్ల వరకు దోచుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అతడిపై అనేక ఫిర్యాదులు రావడంతో గత మే నెలలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావుపేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ(31) బీటెక్‌ చేశాడు. హోటల్‌లో కొంతకాలం పనిచేశాడు. అతడికి హర్ష, హర్షవర్ధన్‌, చెరుకూరి హర్ష అనే మారుపేర్లు కూడా ఉన్నాయి.
 
2015లో క్రికెట్‌ పందేలకు అలవాటుపడ్డ వంశీకృష్ణ.. 2016లో జాబ్‌ కన్సల్టెన్సీ ఆఫీసులో చేరాడు. ఉద్యోగాలిప్పిస్తానంటూ 10 మంది యువకులకు మోసగించిన కేసులో అరెస్టయి జైలుకెళ్లాడు. బయటికి వచ్చాక 94 పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు.
 
మహిళలు, యువతులకు తనను తాను యువతిగా పరిచయం చేసుకునేవాడు. ఆరేళ్ల వ్యవధిలో వంశీకృష్ణ 1000-1500 మంది మహిళలను మోసం చేశాడని విచారణ అధికారులు చెబుతున్నారు. 
 
వంశీకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.4కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. రిమాండ్‌లో ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటపడుతుందని యోచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments