మా కుటుంబంలో మా నాన్నగారి తర్వాత నటీనటులుగా నేను, అక్క, తమ్ముడు వున్నారు. అయితే నటుడు కావాలంటే చాలా కష్టపడాలి. అది నాకు మా నాన్నగారినుంచి నేర్చుకుని హీరోగా ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డాను. ఇప్పుడు మా కుటుంబంలో నా కుమార్తెలను నటీమణులుగా, గాయనీమణులుగా చేయాలని ఆలోచించాను.
అందుకే నేను నటించిన తాజా చిత్రం `జిన్నా`లో నా కుమార్తెలు అరియానా, విరియానాను గాయనిమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. వీరిద్దరూ జిన్నా సినిమాలో కలిసి పాడారు. ఈ పాట ఈనెల 24న విడుదల చేయబోతున్నాం. వాళ్ళు నటీమణులు అవ్వాలన్నది నా కోరిక. కానీ వారు ఏ మార్గం ఎంచుకుంటారనేది వారి ఇష్టం. వారు పెట్టని కొత్త ప్రయాణానికి ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలని మంచు విష్ణు ఓ ప్రకటనలో మీడియా ద్వారా తెలియజేశారు.