Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు ఒత్తిడి... బి-ఫార్మసీ విద్యార్థిని సూసైడ్!!

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (08:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో బిఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు ఒత్తిడి కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషాదకర ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఫిబ్రవరిలో కిడ్నాప్‌ నాటకమాడి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లి డిమాండ్‌ చేసింది. 
 
ఇదే అంశంపై మృతురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ, కీసర ఠాణా పరిధిలోని రాంపల్లి ఆర్‌ఎల్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు మా కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు. అప్పటికే ఆయనకు వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారని చెప్పారు. మాయమాటలతో కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. 
 
సదరు యువకుడు, ఆయన స్నేహితురాలు మా కూతురును మానసిక, శారీరకంగా ఇబ్బందులు పెట్టారన్నారు. అవమానం భరించలేక బీపీ, షుగర్‌ మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడిందన్నారు. సదరు యువకుడి ఒత్తిడి వల్ల ఆటో డ్రైవర్ల పేర్లు చెప్పారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. విద్యార్థిని సదరు యువకుడితో కలిసి దిగిన చిత్రాలను ఆమె మీడియాకు అందజేశారు.
 
బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కారకుడిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదని ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు చెప్పారు. ఆ సమయంలో అన్ని కోణాల్లో అడిగిన ఎలాంటి సమాధానం రాలేదన్నారు. కేసు మూసివేయలేదని, ఇప్పటికైనా ఫిర్యాదు చేస్తే ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments