Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఫస్ట్ టైమ్'' టైటిల్ తో వస్తోన్న బిగ్ బాస్ ఫేమ్ అఖిల్

Advertiesment
Bigg Boss Fame Akhil
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (18:51 IST)
First Time movie launch
హేమంత్ ఆర్ట్స్ పతాకంపై అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్  జంటగా ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఫస్ట్ టైం". ఉగాది పర్వదినం సందర్భంగా ఈసినిమా పూజకార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన యమ్.యల్.ఏ. రఘునందన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకులు జి.నాగేశ్వర్రెడ్డి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్షాట్ డైరెక్షన్ చేశారు.
 
అనంత‌రం రఘునందన్ మాట్లాడుతూ,  కామారెడ్డి నుండి వచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ హేమంత్ దర్శక నిర్మాతగా మారి ఈ సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ ద్వారా వెండి తెరకు పరిచయ‌మై ఇంతింతై వటుడింతై అన్నట్లు నటనలో తన కౌసల్యాని చాటుకొని ముందుకు పోతున్నాడు. ఈ సినిమాతో వెండితెరకు అరంగేట్రం అవుతున్న అఖిల్ కు ఈ మూవీ పెద్ద విజయం సాధించి టీం అందరికీ మంచి పేరు రావాలని అన్నారు.
 
దర్శక, నిర్మాత ఐ.హేమంత్ తెలుపుతూ, అఖిల్ ఈ సినిమా తరువాత పెద్ద హీరో అవుతాడు. హీరోయిన్ కోసం 1500 ప్రొఫైల్స్ చూసి అనికను ఎంపిక చేశాం త్వరలో ఈ సినిమా షూట్ కొరకు కర్నాటకలోని అప్సరకొండ బీచ్ కు వెళుతున్నాము. అక్కడ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి అదే నెల చివరికంతా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాము .అన్నిఅనుకున్నట్లు షూటింగ్ జరిగితే వరల్డ్ లోనే ఫస్ట్ టైం న్యూ ఫార్మాట్ లో ప్రిలుక్ టీజర్ ను రిలీజ్ చేస్తూన్నాం.ఇది పూర్తి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమాను ఆగస్ట్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్భం చేస్తాం. ఈ మూవీ ద్వారా కొన్త నూత‌న సాంకేతిక‌ను తీసుకువస్తున్నాం. అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
హీరో అఖిల్ మాట్లాడుతూ, హేమంత్ ఈ స్టోరీ గత సంవత్సరం క్రితమే చెప్పాడు. నేను ఈ కథ విన్న తరువాత వినూత్న‌మైన క‌థ అనిపించింది. .నేను చాలా కథలు విన్నా హేమంత్ చెప్పిన కథ నా మైండ్ లో ఉండేది. ఇలాంటి కథ నాకు దొరకదని ఈ సినిమా తప్పక  చేయ్యాలని చేస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
హీరోయిన్ అనిక విక్రమన్మాట్లాడుతూ, ఇంత మంచి ప్రాజెక్టు లో నన్నుసెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ, మంచి కథతో వస్తున్న ఈ సినిమాలో పాటలు రాసె అవకాశం ఇచ్చిన హేమంత్ కు  ధన్యవాదాలు తెలిపారు.
 నటీనటులు 
అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్,అజయ్ రత్నం,అనిరుద్, వివారెడ్డి మవురపు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వెంకట్‌, ఫొటోగ్రఫీ : మురళి. వి, ప్రొడక్షన్ కంట్రోలర్ : కె.లక్ష్మణ్ రావ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈనెల 23న ‘తెలంగాణ దేవుడు’