Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ బ్యాగ్‌లో లెటర్ ఉంది తీసి చదువుకో.. నువ్వంటే నాకు ఇష్టం లేదు!?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:40 IST)
పెళ్లైన నాలుగు నెలలకే భర్త పారిపోయాడు. భార్య అంటే ఇష్టం లేదని చెప్పి భర్త ఇల్లు వదిలి పారిపోయిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. షాపూర్‌నగర్‌కు చెందిన హరిక(19), నవీన్ కుమార్ అనే యువకుడికి నాలుగు నెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇద్దరూ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో కాపురం పెట్టారు. నవీన్ కుమార్ ఎస్ ఆర్ నగర్ లోని న్యూఎరా లేడీస్ టైలర్స్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు.
 
కాగా…. దసరా పండుగ సందర్భంగా ఈనెల 15వ తేదీ ఉదయం బస్సు ఎక్కించాడు నవీన్ కుమార్. తెలిసిన వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి…. అవి తీసుకుని ఇంటికి వస్తానని ఆమెతో చెప్పాడు. సాయంత్రం 4గంటలైనా నవీన్ కుమార్ రాకపోయే సరికి భార్య హారిక భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
 
అయితే 16వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో నవీన్ ఫోన్ నుంచి హారిక ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. నీ బ్యాగ్‌లో లెటర్ ఉంది తీసి చదువుకో అని అందులో సారాంశం. దీంతో బ్యాగ్ తెరిచి అందులో భర్త పెట్టిన లెటర్ చూసింది హారిక.
 
"నువ్వంటే నాకు ఇష్టంలేదు… అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను" అని రాసి ఉంది. ఆందోళన చెందిన భార్య, భర్త ఆచూకి కోసం అతని తమ్ముడు, చెల్లెలికి ఫోన్ చేయగా తమ వద్దకు రాలేదని సమాధానం చెప్పారు. దీంతో ఆమె ఆదివారం నాడు జీడిమెట్ల పోలీసులకు భర్త ఆచూకి గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments