అత్తింటికి వచ్చిందనీ భార్య మెడను కోసిన భర్త...

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఓ కిరాతక భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. భార్య అత్తింటికి వచ్చిందనీ ఆమె మెడ కోశాడు. ఈ దారుణం రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (08:36 IST)
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఓ కిరాతక భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. భార్య అత్తింటికి వచ్చిందనీ ఆమె మెడ కోశాడు. ఈ దారుణం రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తొనిగండ్ల గ్రామానికి చెందిన పుర్ర కుమార్‌కు నార్సింగి మండల కేంద్రానికి చెందిన సరితతో గత 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కాగా వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మద్య తరతూ గొడవలు జరుగుతుండేవి. గత రెండు నెలల క్రితం ఇంట్లో గొడవ జరగ్గా సరిత తన పుట్టింటికి వెల్లి పోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల సరిత అత్త, మామలు నచ్చ చెప్పి ఆమె పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకొచ్చారు. ఈవిషయం తెల్సుకున్న భర్త బుధవారం ఇంటికి చేరుకుని భార్యపై కత్తితో దాడి చేశాడు. భర్త చర్యను భార్య అడ్డుకుంది. అయినప్పటికీ వదిలిపెట్టని భర్త ఆమె మెడ భాగంతో పాటు, చేతులపై దాడి చశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. 
 
తనను చంపేస్తాడనీ భావించిన ఆమె.. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చేసరికి కుమార్ పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను రామాయంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments