Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో భానుడి ప్రతాపం - వడదెబ్బకు ఐదుగురు మృతి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణతాపం కారణంగా అనేక వడదెబ్బకు గురవుతున్నారు. తెలంగాణాలో వడదెబ్బ తగలడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్క రోజే వీరంతా చనిపోయారు. 
 
మృతులను ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూలు మండలం రాజులగూడకు చెందిన గుణాజీ అనే ఆరేళ్ళ బాలుడు, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాలాజీ (45)లు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బోధ్ మండలంలో ఓ నిర్మాణ కూలి (32), సూర్యాపేట నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య (48), యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ (45)లు కూడా వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు గరిష్ట స్థాయిలోఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, పగటి ఉష్ణోగ్రతలపై జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీచేశారు. కాగా, సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్‌లో సోమవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments