రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలకా్ట్రనిక్స్ నేడు తమ అత్యాధునిక తయారీ యూనిట్ ను హైదరాబాద్‌లో గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ది, పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖామాత్యులు శ్రీ కె టి రామారావు; గౌరవనీయ విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి; గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర ఐటీ, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఐఏఎస్; టీఎస్‌ఐఐసీ వీసీ అండ్ ఎండీ శ్రీ ఈ.వి. సరసింహా రెడ్డి మరియు టీ-ఫైబర్ సీఈవో; డైరెక్టర్-ఎలక్ట్రానిక్స్ శ్రీ సుజల్ కర్మపురితో పాటుగా రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రమీందర్ సింగ్ సోయిన్; రేడియంట్ అప్లయెన్సస్ డైరెక్టర్ శ్రీ మణికందన్ నరసింహన్ సమక్షంలో ప్రారంభించినట్లు వెల్లడించింది.
రేడియంట్ అప్లయెన్సస్ తమ ఉత్పత్తి సామర్ధ్యంను సంవత్సరానికి 2.1 మిలియన్ యూనిట్ల నుంచి 4.5 మిలియన్ యూనిట్లకు ఈ నూతన ప్లాంట్ జోడింపుతో విస్తరించనుంది. హైదరాబాద్‌లోని తమ అత్యాధునిక తయారీ కేంద్రంతో రేడియంట్ అప్లయెన్సస్, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాణ్యత మరియు తయారీ ప్రక్రియ, సుశిక్షితులైన 3800 మంది ఉద్యోగులతో రెండు సంవత్సరాల వ్యవధిలో 5 మిలియన్‌లకు పైగా ఎల్‌ఈడీ టీవీలను మహమ్మారి కారణంగా సరఫరా పరంగా పెను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఉత్పత్తి చేసింది.
రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలకా్ట్రనిక్స్ నూతన ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఐటీ మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ కె టీ రామారావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ప్లాంట్‌ను 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుచేశారు. దీనిద్వారా అదనంగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణాలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరంగా అత్యున్నత సంస్ధలలో ఒకటిగా రేడియంట్ కొనసాగుతుండటంతో పాటుగా ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామి సంస్థలలో ఒకటిగా నిలుస్తుంది. స్వల్పకాలంలోనే 5 మిలియన్ ఎల్‌ఈడీ టీవీల ఉత్పత్తిని సాధించిన రేడియంట్ టీమ్‌ను అభినందిస్తున్నాను. ఈ నూతన సామర్ధ్య విస్తరణతో, రేడియంట్ మరిన్ని నూతన మైలురాళ్లను అందుకోగలదని , మరింతగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తూనే తెలంగాణాలో తయారీ వాతావరణం సృష్టించగలదని ఆశిస్తున్నాను అని కె టి రామారావు అన్నారు.
తెలంగాణాలో తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం అందించనున్నట్లు ఆయన వెల్లడిస్తూ, పరిశ్రమకు పూర్తి అనుకూలమైన రాష్ట్రం తెలంగాణా. ఎలక్ట్రానిక్స్ మొదలు ఎలక్ట్రిక్ వాహనాల వరకూ అన్ని ఉత్పత్తి విభాగాలలోనూ తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాము. అత్యుత్తమ మౌలిక వసతులతో పాటుగా తెలంగాణా రాష్ట్రంలో యువ నైపుణ్యవంతులైన మానవ వనరుల లభ్యత కూడా అధికంగా ఉంది అని అన్నారు.
భారతదేశంలో ఎల్‌ఈడీ టీవీ తయారీ పరంగా అతిపెద్ద ఓఈఎంలలో ఒకటైన స్కైవర్త్‌తో రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలకా్ట్రనిక్స్, హైదరాబాద్ భాగస్వామ్యం చేసుకుంది. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన 15కు పైగా భారతీయ , ఎంఎన్‌సీల అవసరాలను తీరుస్తోన్న రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ భారతదేశపు మార్కెట్‌లో 25% డిమాండ్‌ను తీర్చనుంది.
తెలంగాణా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (ఐ అండ్ సీ, ఐటీ, వాణిజ్యం) శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ ఎలకా్ట్రనిక్స్ స్థానిక తయారీని తెలంగాణా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇప్పుడు తెలంగాణాలో అత్యంత విజయవంతమైన ఎలకా్ట్రనిక్స్ తయారీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. త్వరలోనే రేడియంట్ అప్లయెన్సస్ ఇతర ఉత్పత్తి విభాగాలలో సైతం ప్రవేశించడం ద్వారా తెలంగాణాను ఎలకా్ట్రనిక్స్ మరియు అప్లయెన్సస్ కేంద్రంగా తీర్చిదిద్దగలదని ఆశిస్తున్నాను అని అన్నారు.
రేడియంట్ అప్లయెన్సస్ డైరెక్టర్ శ్రీ మణికందన్ నరసింహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేడియంట్ అప్లయెన్సస్ స్ధిరంగా ఎలకా్ట్రనిక్స్ తయారీలో నూతన మైలురాళ్లను చేరుకుంటూనే ఉంది. పరిశ్రమ అనుకూల వాతావరణంతో పాటుగా ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం వంటివి మా విజయానికి తోడ్పాటునందించాయి అని అన్నారు.
రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలకా్ట్రనిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రమీందర్ సింగ్ సోయిన్ మాట్లాడుతూ, తయారీకి సంబంధించిన నూతన ప్లాంట్ ప్రారంభంతో మా సామర్థ్యం విస్తరించాము. సమీప భవిష్యత్‌లో ఎల్‌ఈడీ టీవీ తయారీ పరంగా మేము నెంబర్ 1గా నిలువనున్నాము. రేడియంట్ అప్లయెన్సస్ స్థిరంగా స్వదేశీకరణ చేసేందుకు కృషి చేయడంతో పాటుగా స్థానిక వెండార్లతో సన్నిహితంగా పనిచేస్తూ అనుబంధ సంస్ధలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రోత్సహించడానికి తగిన వాతావరణం సృష్టిస్తుంది. సమీప భవిష్యత్‌లో భారీ గృహోపకరణాల విభాగంలో నూతన తయారీ యూనిట్లను జోడించడం ద్వారా గణనీయంగా స్ధానిక ఉపాధి అవకాశాలను అందించనున్నాం అని అన్నారు.