Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు.. రోడ్లన్నీ అధ్వానం.. కేటీఆర్ సంచలనం

Advertiesment
ktramarao
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (16:07 IST)
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని, ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని అన్నారు. 
 
ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని, బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు.
 
శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని, దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని, నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాచలంలో అమానుష ఘటన: గర్భిణిపై అత్యాచారయత్నం