Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీపై KTR సంచలన ట్వీట్: కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు

ktramarao
, సోమవారం, 2 మే 2022 (15:57 IST)
టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. దేశంలో  ఏడేళ్ల బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చేనిధుల కొరత వచ్చిందన్నారు. 
 
ఈ సమస్యలకు పీఎం, మోడీకి విజన్ లేకపోవడమే కారణమంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ ట్వీట్లకు ధీటుగానే బదులిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 
 
టీఆర్ఎస్ ఏడేళ్ల పాలన వైఫల్యాలను  ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. "టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు, రుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేదు, ఋణమాఫీ లేదు, దళిత ముఖ్యమంత్రి లేదు,దళితులకు మూడెకరాల భూమి లేదు, పంటనష్ట పరిహారం లేదు, దళితబందు లేదు, బిసిబందు అసలే లేదు.
 
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు, డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు, అప్పులకు కొదవ లేదు, కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు, కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు,సామాజిక న్యాయం లేదు, సచివాలయం లేదు, సీఎం ప్రజలను కలిసేది లేదు.
 
ఉద్యమ కారులకు గౌరవం లేదు, విమోచన దినోత్సవం జరిపేది లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు" అంటూ విమర్శించారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ : డీజీపీకి చంద్రబాబు లేఖ