Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పెరుగుతున్న క్రైమ్ రేట్ : డీజీపీకి చంద్రబాబు లేఖ

Advertiesment
chandrababu naidu
, సోమవారం, 2 మే 2022 (15:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా హత్యలు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరకు పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వెళ్లేవారిని పోలీసులే పట్టుకుని చితకబాదుతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న నేపాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు సహా పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. 
 
రాష్ట్రంలో శాంతిభద్రతు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా ఆటవిక పాలన సాగుతోందని ఫలితంగా ప్రజలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనివున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా మంట - కేజీపై రూ.50 పెరుగుదల