తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన సత్యభామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీమ్డ్ యూనివర్శిటీ)లో జాబ్ మేళా జరిగింది. "ఉద్యోగ అవకాశం 2022" పేరుతో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికైన విద్యార్థి విద్యార్థినులకు ఉద్యోగ నియామకం అందించే కార్యక్రమం తాజాగా జరిగింది.
ఈ యూనివర్శిటీ చాన్సలర్ డాక్టర్ మరియాజీనా జాన్సన్, ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ జాన్సన్, వైస్ ప్రెసిడెంట్ జె.అరుళ్ సెల్వన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్నిజెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ ధనకోటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నవారిలో 92.14 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఇప్పటివరకు 2004 మంది విద్యార్థులకు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ముఖ్యంగా, ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రస్తుతం ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో 363 మంది ఎంపికయ్యారు.
ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలలో 84 ప్రముఖ రిక్రూట్మెంట్ కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో సిలికాన్ ల్యాబ్, ఓపెన్ టెక్స్ట్, మిర్కెటా వంటి పలు కంపెనీలు ఉన్నాయి. తదుపరి వచ్చే విద్యార్థుల బ్యాచ్‌కు ఇది ఎంతగానో దోహదపడనుంది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలలో మొత్తం 2004 మందికి నియామక ఉత్తర్వులు అందజేయగా, వీరిలో అత్యధికంగా 31 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది.
2021-22 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 28వ తేదీ 2022 వరకు మొత్తం 363 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొనగా, మొత్తం 2004 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఇది 92.14 శాతంగా ఉంది. అత్యధిక వార్షిక పారితోషికం రూ.31 లక్షలు కాగా, సగటు వార్షిక వేతనం రూ.4.75 లక్షలు.
ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలలో సిస్కో, కాంగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమిని, హెచ్‌సిఎల్, ఒరాకల్, వెరిజాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐసీఐసీఐస, ఐబీఎం, నోకియా, హ్యూండాయ్, రేనాల్ట్ నిస్సాన్, ఎల్అండ్‌టి, డెలాయిట్, సిలికాన్ ల్యాబ్, ఈవై, ఎఫ్ఐఎస్ గ్లోబల్, జిఫో ఆర్అండ్‌డి వంటి కంపెనీలు పాలుపంచుకున్నాయి.