తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం రంగం సిద్ధం అవుతుంది. ఈ మేరకు అతి త్వరలోనే 13వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు.
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్ధులు, పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. బుధవారం నాడు సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. సిద్దిపేటను విద్యాక్షేత్రంగా మార్చుకున్నామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఒక జూనియర్ కాలేజీని కూడా తెచ్చుకోలేకపోయామని, కానీ ఇప్పుడు మెడికల్ కళాశాలను కూడా తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేటలో నెలకొల్పిన నీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన హరీష్, దేశానికే సిద్దిపేట ఒక రోల్ మోడల్‌గా మారుస్తామన్నారు.