లోక్‌సభ బరిలో ఉపాసన... తెరాస అభ్యర్థిగా చెర్రీ వైఫ్?!

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:54 IST)
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ తరపున పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి. అదీకూడా తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఆమె పోటీ చేయవచ్చంటూ ఈ ప్రచారం సాగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ విషయం చెర్రీ వైఫ్ ఉపాసన దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె వెంటనే స్పందించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ తరపున తాను పోటీ చేయబోతున్నారనే వార్తా కథనం ఉత్తుత్తిదే. ఈ కథనంలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నట్టు చెప్పారు. సంగీతా రెడ్డి (విశ్వేశ్వర్ రెడ్డి భార్య) తన బాస్ అని చెప్పారు. చేవెళ్లలో తన చిన్నాన్న విశ్వేశ్వర్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. 
 
కాగా, దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెస్క్‌లో ఉపాసన కూర్చొని, ఈ స్టాల్‌కు వచ్చిన పెట్టుబడిదారులకు రాష్ట్రంలో పెట్టుబడులకు గల కారణాలను వివరించారు. దీనిపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎంతగానో అభినందించారు కూడా. ఈ నేపథ్యంలో ఉపాసన తెరాస తరపున ప్రచారం చేయనున్నారనే పుకార్లు వైరల్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments