Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో గులాబీ దండు.. కేసీఆర్ ధర్నా.. 24 గంటల టైమ్ ఇస్తున్నాను..

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:33 IST)
తెలంగాణ రైతుల పక్షాన నిరసన దీక్ష పేరుతో టీఆర్‌ఎస్‌ దీక్ష చేపట్టింది.  రాష్ట్రం నుంచి 15 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సోమవారం దేశ రాజధానిలో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక రోజు ధర్నాకు దిగారు.
 
ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఈ దీక్ష ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందన్నారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని అన్నారు.
 
'ప్రధాని మోదీకి దమ్ము ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయనివ్వండి. చేతులు జోడించి, నేను ప్రధాన మంత్రి, (కేంద్ర ఆహార మంత్రి) పియూష్ గోయల్‌కు చెబుతున్నాను. దయచేసి మా ఆహార ధాన్యాలను కొనండి. నేను మీకు 24 గంటల సమయం ఇస్తాను, ఆ తర్వాత మేము మా నిర్ణయం తీసుకుంటాము" అని కేసీఆర్ సవాల్ విసిరారు. 
 
ఇకపోతే... ఢిల్లీ వీధులన్నీ టీఆర్‌ఎస్‌ నేతలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా రైతులకు న్యాయం చేయాలన్న ప్లకార్డులే కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్‌ వైపు వెళ్లే దారులన్నీ కేంద్ర ప్రభుత్వ వివక్షను నిలదీస్తూ రూపొందించిన హోర్డింగులతో గులాబీ రంగు పులుముకొన్నాయి. దీక్షా ప్రాంగణం చుట్టూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
 
రైతుల నుంచి పంట కొనకుండా ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డుతుందని మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్‌ కాపాడుకొంటారని తెలిపారు. 
 
బీజేపీ నాయకులకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్‌ విసిరారు గులాబీ నేతలు. బీజేపీ నేతలు సోమవారం హైదరాబాద్‌లో ధర్నా చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం