Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుల మధ్య అమ్మాయి గొడవ, మధ్యలోకెళ్లిన తెరాస నేత దారుణ హత్య

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (14:08 IST)
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయమై కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు గొడవపడ్డారు. అలా గొడవపడవద్దంటూ వారించబోయిన తెరాస నాయకుడుని సదరు కుర్రాళ్లు దారుణంగా పొడిచి చంపారు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి మృతుడు లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు తన వాట్సాప్‌ స్టేట్‌స్ లో ఓ యువతికి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెపుతూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు నేరుగా జహంగీర్ కుమారుడిపై లతీఫ్ షాపు ఎదుటే దాడి చేయడం ప్రారంభించారు. ఇది చూసన లతీఫ్ వారిని వారించబోయాడు. 
 
ఇలాంటి తగాదాలు ఇక్కడ రాత్రివేళల్లో చేయవద్దనీ, రేపు ఉదయం వివరంగా మాట్లాడుకోవచ్చని నచ్చజెపుతుండగా యువకులు అతడిపైన కూడా దాడి చేశారు. కత్తితో లతీఫ్‌ను పొడిచారు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments