Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చదువు చార్టెర్డ్ అకౌంటెంట్... చేసేది అమ్మాయిల ఫోటోలతో చీటింగ్...

Advertiesment
చదువు చార్టెర్డ్ అకౌంటెంట్... చేసేది అమ్మాయిల ఫోటోలతో చీటింగ్...
, శనివారం, 14 మార్చి 2020 (11:48 IST)
అతను చదివింది చార్టెడ్ అకౌంటెంట్. చేసేది మాత్రం అమ్మాయిలతో పాటోలతో చీటింగ్. చివరకు అతని పాపంపండి పోలీసులకు చిక్కాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగరానికి చెందిన వెన్నెల వెంకటేష్ అనే యువకుడు విజయవాడలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నాడు. ఇతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలున్న విద్యార్థులు, యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటిని టిండర్ యాప్లో ఫోస్ట్ చేస్తూ వచ్చాడు. ఆ ఫోటోల కింద ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలని ఫోన్ నంబరు ఇచ్చేవాడు.
 
అమ్మాయిల ఫోటోలను చూసి, వారు కావాలనుకునేవారు సంప్రదించవచ్చంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలను చూసి తనను సంప్రదించిన యువకులకు తన ఖాతాలో రూ.100, రూ.300, రూ.500 జమ చేయమని చెప్పేవాడు. అలా జమ చేసిన వారితో అమ్మాయిల పేరుతో తనే సరస సంభాషణలతో చాట్ చేసేవాడు. శృంగార దృశ్యాల ఫొటోలు, నీలి చిత్రాలు వాట్సాప్‌లో పోస్టు చేసేవాడు. ఈ విధంగా రోజుకి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెంకటేష్ ఖాతాలో జమయ్యేవి.
 
ఈ డబ్బుతో హైదరాబాద్ వంటి చోట్లకు వారానికోసారి వెళ్లి పబ్‌లకు వెళుతూ విలాసాల్లో మునిగితేలేవాడు. వేల రూపాయలు వెచ్చించి రమ్మీ ఆడేవాడు. ఈ క్రమంలో టిండర్ డేటింగ్ యాప్‌లో తన ఫొటోలు ఉండటం గమనించిన బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువతి స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన సైబర్ క్రైం పోలీసులు వారం రోజుల్లో నిందితుడిని గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ ఉద్యోగి భార్యకూ కరోనా .. 9 మంది కరోనా బాధితులు జంప్