Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలితో రసపట్టులో ప్రియుడు, పదేపదే ఫోన్లు రావడంతో విసిగిపోయి...

Advertiesment
ప్రియురాలితో రసపట్టులో ప్రియుడు, పదేపదే ఫోన్లు రావడంతో విసిగిపోయి...
, శనివారం, 14 మార్చి 2020 (19:35 IST)
విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిన మహిళ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో జరిగింది. ఆమెతో బెడ్రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకి పదేపదే ఫోన్లు రావడంతో చిరాకు పడిన ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. పోలీసుల విచారణలో మహిళ గురించి పోలీసులే ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడయ్యాయి.
​ 
తిరుప్పూర్ జిల్లా పల్లడమ్ ప్రాంతానికి చెందిన సెల్వీ అలియాస్ బేబీ తూత్తుకుడిలోని ముత్తయాపురంలోని ఒకప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భర్త లేకపోవడంతో నేతాజీనగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.

అడ్డు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో సెల్వీ విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడింది. తాను పనిచేసే సంస్థలో ఉద్యోగులతో పాటు స్థానికంగా ఉండే మరికొందరితోనూ ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో రోజూ రాత్రి ప్రియుళ్లతో లైంగిక సుఖాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తోంది.
 
మొన్న రాత్రి తన కంపెనీలో పనిచేసే రాజేందర్ అనే వ్యక్తిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి మంచి రసపట్టులో ఉన్నారు. ఈ సమయంలో పదేపదే ఆమెకు ఫోన్లు వచ్చాయి. ఎవరెవరో ఫోన్లు చేయడం.. ఆమె ఫోన్ ఆన్సర్ చేసి గంటల తరబడి మాట్లాడటం రాజేందర్‌కు చిరాకు తెప్పించింది.

ఓపిక నశించిపోయిన రాజేందర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ బేబీ గట్టిగా అరవడంతో ఆగ్రహంతో వంట గదిలోకి వెళ్ళిన రాజేందర్ కత్తి తీసుకుని ఆమె పొట్టలో పొడిచాడు. దీంతో బేబీ అక్కడికక్కడికే కుప్పకూలిపోయింది. నిందితుడు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ నియంత్రణ: తెలంగాణలో స్కూళ్లు-థియేటర్లు మూసివేత- తితిదే సంచలన నిర్ణయం