Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపా-85, టీఆర్ఎస్-29, ఎంఐఎం-17 GHMCలో కమల వికాసం

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (11:41 IST)
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో భాజపా తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మొత్తం 150 స్థానాలకు గాను భాజపా 85 చోట్ల తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తెరాస 29 చోట్ల, ఎంఐఎం 17 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల ఆధిక్యంలో వున్నాయి. ఈ ఎన్నికల వేళ కేంద్ర నాయకులందరూ హైదరాబాద్ బాట పట్టిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద గ్రేటర్ పరిధిలో కమలం దూసుకుపోతోంది.
 
కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభంలో అధికార తెరాసకు తేరుకోలని షాక్ కొట్టింది. ప్రారంభంలో 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. 
 
ఈ నెల ఒకటో తేదీన 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 34,50,331 ఓట్లు పోలయ్యాయి. 1,926 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అధికారులు జారీ చేశారు. మొదటి రౌండ్‌గా వీటిని తెరిచారు. డివిజన్ల వారీగా పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఫలితాలను ప్రకటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, బ్యాలెట్ పేపర్‌పై పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్టేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించలేదని ఆరోపిస్తూ, బీజేపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments