Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్వస్తిక్' గుర్తు ఉంటేనే ఓటు : తెలంగాణా హైకోర్టు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (10:28 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్వస్తిక్ గుర్తుకాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వలును హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్ట్ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
బ్యాలెట్‌పై స్వస్తిక్‌ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిస బీజేపీ... హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 
 
బీజేపీ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణించాలని సూచించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే కోర్టు తదుపరి ఆదేశాలకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.
 
కాగా, ఎన్నికల సంఘం రాత్రికి రాత్రి జారీచేసిన సర్క్యూలర్‌పై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో జారీ చేసిన నిబంధనల్లో ఈ నిబంధన ఎందుకు చేర్చలేదంటూ నిలదీశారు. ఈ సర్క్యూలర్‌ను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ సమస్యకు పరిష్కారం చిక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments