నాలుగు రైళ్లను 24 రోజుల పాటు రద్దు చేసిన ద.మ.రైల్వే

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (09:28 IST)
నాలుగు రైళ్లను 24 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది కాజీపేట - బల్లార్ష సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. మరో 12 రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు. 
 
సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (12758), కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ (17003), బల్లార్ష-సిర్పూర్‌టౌన్‌ (17004) రైళ్లను జూన్‌ 27 నుంచి జులై 20 వరకు 24 రోజులపాటు రద్దు చేసినట్టు తెలిపింది. హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17001), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-హైదరాబాద్‌ (17002) రైళ్లను జులై 10, 13, 20 తేదీల్లో మాత్రం రద్దు చేసినట్టు పేర్కొంది. 
 
అలాగే, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. భద్రాచలం రోడ్‌-బల్లార్ష (17003) రైలు జూన్‌ 27 నుంచి జులై 20 వరకు వరంగల్‌-బల్లార్ష మధ్య రద్దు చేయగా, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌ (17034) జూన్‌ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్‌ టౌన్‌-వరంగల్‌ మధ్య, సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233) జూన్‌ 26 నుంచి జులై 19 వరకు కాజీపేట-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (17234) జూన్‌ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-కాజీపేట మధ్య రద్దయ్యాయి.
 
ఇకపోతే, దారిమళ్లించిన రైళ్లను పరిశీలిస్తే, తిరుపతి - జమ్ముతావి (22705) రైలును జులై 5, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, ముద్కేడ్‌, పింపల్‌కుట్టి మీదుగా, సికింద్రాబాద్‌-దానాపూర్‌, దానాపూర్‌-సికింద్రాబాద్‌ (12791/12792) రైళ్లను జూన్‌ 26 నుంచి జులై 19 వరకు పెద్దపల్లి-నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. మరో తొమ్మిది రైళ్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

బాలకృష్ణ గారిలా తొడగట్టి K-ర్యాంప్ విజయం అని చెప్పాం : రాజేశ్ దండ, శివ బొమ్మకు

Nayanatara: మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments