సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. విధ్వంసానికి సంబంధించిన కొత్త ఆధారాలు దొరికాయి. రైళ్లకు నిప్పు పెట్టిన కీలక ఎవిడెన్స్ పోలీసులకు దొరికింది. ఈ కేసులో రైళ్లను తగలబెట్టినవారిని పోలీసులు గుర్తించారు.
రైళ్లు ఎలా తగలబెట్టారో వీడియోలో కనిపించింది. అంతేగాకుండా కోచ్‌లో సీట్లకు పేపర్లను కుక్కి అగ్గిపెట్టెతో అంటించారు. ఈ విజువల్స్ ప్రకారం ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు కనుగొనేందుకు సులభం అయ్యింది.
ఇప్పటికే ఇద్దరు యువకులను గుర్తించారు. వీరిపై అభియోగాలు రుజువైతే మరణశిక్ష గాని, యావజ్జీవం కానీ పడే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
సికింద్రాబాద్ అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన రైల్వే పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు. రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను చేర్చారు.