Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌లో ఘోరం - కంటైనర్‌ను ఢీకొన్న కారు - నలుగురి మృతి

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (08:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి కంటైనర్‌ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సీతాగొంది వద్ద జరిగింది. 
 
ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రమాదస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహళ ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆదిలాబాద్ వాసులుగా గుర్తిచారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments