హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు చేదువార్త... చార్జీల భారం!

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (08:27 IST)
హైదరాబాద్ నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది చేదువార్త. త్వరలోనే మెట్రో రైల్ చార్జీలను పెంచనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సూచన ప్రాయంగా వెల్లడించింది. చార్జీలను పెంచాలన్న యాజమాన్యం అభ్యర్థనకు కేంద్రం ప్రభుత్వం ఫేర్ ఫిక్స్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ  కమిటీ వెంటనే రంగంలోకి దిగి మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను స్వీకరించే ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం నవంబరు 15వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు, నగర వాసులు ffchmrl@gmail.com ద్వారా కానీ ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైల్ భవన్, బేగంపేట, హైదరాబాద్ 500003 అనే చిరునామాకు పోస్టు ద్వారాగానీ పంపాలని సూచించింది.
 
సాధారణంగా మెట్రో రైలు చార్జీలను పెంచే అధికారం కేవలం మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే తొలిసారి ఉంటుంది. ఆ తర్వాత వాటిని సవరించే అధికారం మాత్రం ఫేర్ ఫిక్సేషన్ కమిటీకే ఉంటుంది. మెట్రో చార్జీలను ఏ మేరకు పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం