నాన్నమ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భవనం: మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (16:25 IST)
త‌న నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నా గ్రామం-నా పాఠ‌శాల కార్య‌క్ర‌మం కింద త‌న సొంత ఖ‌ర్చుల‌తో పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. నానమ్మను స్మరించుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి మార్గం గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు.
 
కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్ భ‌వ‌నానికి మంగళవారం శంకుస్థాప‌న చేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కామారెడ్డి జిల్లా బేబీ పేట మండలం కోనాపూర్ గ్రామానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్న ఆయన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జి వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. 
 
గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి కేటీఆర్ నివాళులర్పించారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులను, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments