Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం - కాలిబూడిదైన శివపార్వతి థియేటర్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (07:31 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానికంగా ఉన్న శివపార్వతి థియేటర్ కాలిబూడిదైంది. ఈ సినిమా హాలులో సంభవించిన అగ్నిప్రమాదంలో థియేటర్ కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మూడు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
 
ఈ ప్రమాదం జరిగిన రాత్రి సమయంలో కావడంతో పెను విపత్తు తప్పింది. సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, థియేటర్‌ సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. 
 
కాగా, థియేటర్‌లో ఏర్పడిన విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో థియేటర్‌లోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments