Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదివింది బీఎస్సీ.. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు.. ఎలా పట్టుకున్నారంటే..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (09:26 IST)
బీఎస్సీ చదవిన ఓ మెడికల్ రిప్రజెంటేటివ్‌ డాక్టర్‌గా అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా వరంగల్‌ నగరం నడిబొడ్డున ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా అబార్షన్లలో దిట్టగా మారాడు. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బుధవారం అర్ధరాత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడిచేసి పోలీసులకు అప్పగించారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి(38) నెల రోజుల క్రితం హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్‌ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. రెండోసారి ఆడపిల్లలు వద్దనుకునే మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తిస్తున్నాడు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారి సాయంతో.. యూట్యూబ్‌ చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడిచేశారు.
 
ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు చికిత్స చేస్తున్నారు. అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇంకా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments