Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం.. 70మంది కరోనా బాధితులు..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (08:19 IST)
Mumbai
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని కరోనా దవాఖానాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ముంబైలోని భాండవ్ లో ఉన్న ఓ కరోనా ఆసుపత్రిలో ఈ ఘోరం జరిగింది. దాదాపు 70 మంది బాధితులను సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 76 మంది భాండవ్‌లోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి తరలి వచ్చాయి. 23 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్యను పెంచారు. ఆసుపత్రులకు కరోనా బాధితుల తాకిడి పెరిగింది.
 
దవాఖానలో ఉన్న 70 మంది రోగులను మరో హాస్పిటల్‌కు తరలించామని ముంబై మేయర్‌ కిశోరి పడ్నేకర్‌ తెలిపారు. అందులో కరోనా బాధితులు కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ మాల్‌లో దవాఖానను చూడటం ఇదే మొదటిసారి. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments