Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వ్యాక్సిన్‌ను తెలంగాణకు ఇవ్వాలి.. ఈటెల డిమాండ్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (12:08 IST)
ప్రపంచమంతా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, తదితర కంపెనీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
 
అయితే నగరం నుండి వ్యాక్సిన్ తయారీ అవుతున్న కారణంగా ముందుగా వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్రజలకే ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని ఈటెల కోరారు. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని డోసులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అందేలా చూడాలని ప్రధానిని ఈటెల కోరారు. హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి తుదిదశకు చేరుకుంది. 
 
ఇప్పటికే మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా, వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఫార్మారంగానికి తెలంగాణ చూపిన చొరవకు కృతజ్ఞతగా, ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కల్పిస్తున్న సందర్భంగా.. తొలి వ్యాక్సిన్‌ను తమకే ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments