Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నివర్ తుఫాన్, తమిళనాడుకు రెడ్ ఎలర్ట్, ఏపీ-తెలంగాణలకు ఎల్లో ఎలర్ట్

నివర్ తుఫాన్, తమిళనాడుకు రెడ్ ఎలర్ట్, ఏపీ-తెలంగాణలకు ఎల్లో ఎలర్ట్
, మంగళవారం, 24 నవంబరు 2020 (17:09 IST)
నివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాగా నవంబర్ 25- నవంబర్ 26న దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా తీరప్రాంత, ఉత్తర అంతర్గత తమిళనాడు, పుదుచ్చేరి- కరైకల్ మీదుగా విస్తృతంగా వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
 
నవంబర్ 25 బుధవారం సాయంత్రం నివర్ తుఫాను తమిళనాడులోని కరైకల్- మామల్లపురం మధ్య పుదుచ్చేరి తీరాలను దాటుతుంది. ఈ తుఫాను పశ్చిమ-ఉత్తరం వైపు, ఆ తరువాత వాయువ్య దిశగా వెళ్ళే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. తుఫాను ప్రభావంతో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.
 
మంగళవారం ఉదయం 11.30 గంటలకు నివర్ తుఫాన్ పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంలో 380 కిలోమీటర్లు మరియు చెన్నైకి ఆగ్నేయంలో 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తమిళనాడు, పుదుచ్చేరికి ఐఎమ్‌డి రెడ్ అలర్ట్ జారీ చేయగా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పసుపు హెచ్చరిక జారీ చేయబడింది. తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో బుధవారం 24 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
 
నవంబర్ 25 వరకు బంగాళాఖాతంలో పశ్చిమ-నైరుతి ప్రాంతాలలో జాలర్లు చేపలు పట్టడాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఐఎండి సూచించింది. రాబోయే మూడు రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకుని పుదుచ్చేరిలో 144వ సెక్షన్ విధించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి ప్యాంటు, సూటు వేసుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫోటోలు