Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో కొత్తగా 761 కేసులు... 4 నుంచి థియేటర్లు ఓపెన్

తెలంగాణాలో కొత్తగా 761 కేసులు... 4 నుంచి థియేటర్లు ఓపెన్
, శుక్రవారం, 27 నవంబరు 2020 (10:00 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,242 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. నిన్న నలుగురు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,448కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 53,32,150 కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.
 
ఇదిలావుంటే, కొవిడ్ కారణంగా తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు వచ్చే నెల 4 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అదేరోజున ఓ ఇంగ్లీష్ సినిమా విడుదల కానుండడంతో సినిమా హాళ్లను తిరిగి తెరవాలని వాటి యజమానులు నిర్ణయించారు. 
 
మల్టీ‌ప్లెక్స్‌లు కూడా అదే రోజు తెరుచుకోనున్నాయి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లను తిరిగి తెరవవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంతో థియేటర్ యజమానులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
 
కాగా, నాలుగు షోలే కాకుండా ఎక్కువ ఆటలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ల ధరలను పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యజమానులు ఆ దిశగానూ కసరత్తు ప్రారంభించారు. 
 
అయితే, కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో పాత సినిమాలు వేస్తే థియేటర్లకు ఎవరూ రారని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్ పేర్కొన్నారు. థియేటర్‌ను ఎప్పుడు తెరవాలనే దానిపై తాము ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. 
 
డిసెంబరు 4, లేదంటే 11 నుంచి సినిమా హాళ్లను తెరిచే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యజమానుల చేతిలోనే వున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు వచ్చే నెల 4న తెరుచుకుంటాయన్నారు. లీజులో ఉన్న థియేటర్లు మాత్రం పెద్ద సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో విలయతాండవం చేసిన నివర్ తుఫాను : చెన్నైకు రాకపోకలు బంద్!