Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన ఈనాడు విలేకరి: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీశ్ రావు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (18:02 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ బీభత్సాన్ని సృష్టిస్తోంది. గతంలో కరోనా సోకినా హోం క్వారెంటైన్లో వుండి క్రమంగా కోలుకున్న పరిస్థితులు వున్నాయి. కానీ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా వుంటోంది. ఎంతోమంది పొట్టనబెట్టుకుంటోంది. ఈనాడులో గత పదిహేడేళ్లుగా కంట్రిబ్యూటర్‌గా విధులు నిర్వర్తించే చింతా నాగరాజుకి కరోనా సోకింది.
 
దుబ్బాకకు చెందిన నాగరాజుకి పది రోజుల క్రితం కరోనా వచ్చింది. దీనితో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఐతే బుధవారం నాడు వున్నట్లుండి తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు విడిచారు.
 
43 ఏళ్ల చింతా నాగరాజు మరణం పట్ల తెలంగాణ మంత్రి హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆత్మీయుణ్ణి కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేసారు. నాగరాజు మరణించడానికి ఓ గంట ముందు కూడా అతడితో మాట్లాడాననీ, తిరిగి కోలుకుంటారని అనుకున్నాననీ, కానీ ఆయనను కాపాడుకోలేకపోయామని అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

సంబంధిత వార్తలు

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments