Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతపై కరోనా పంజా... యువకుల్లో సగంమందికి పాజిటివ్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:53 IST)
కరోనా రెండో దశ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో 50 ఏళ్ళు పై బడిన వారే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే రెండో దశలో ఎక్కువగా యువకులే ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నట్లు రిపోర్ట్‌‌లు వెల్లడిస్తున్నాయి. 5 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సైతం మహమ్మారి వదలడం లేదు.
 
మంగళగిరి పట్టణంలో బుధ, గురువారాల్లో 109 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 40 ఏళ్ల లోపు వారు 32 మంది ఉండగా, 30 ఏళ్ల లోపు వారు 16 మంది ఉన్నారు. 20 ఏళ్ల లోపు వారు 10 మంది, 10 ఏళ్ల లోపు వారు ముగ్గురు చొప్పున వైరస్ ప్రభావానికి గురయ్యారు.
 
మరణాల సంఖ్య కూడా పెరిగి పోతున్నా వివరాలు బయటకు రానివ్వటం లేదు. గతం కంటే పరిస్థితి భిన్నంగా ప్రమాదకరంగా మారింది. దీనిని బట్టి యువత అప్రమత్తంగా ఉంటూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం వీడి మాస్కుల వాడకం భౌతిక దూరం పాటించటం విస్మరించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికే ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తుంది. మే ఒకటి నుండి 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ మందికి టెస్టులు జరిపి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఇదేంటి బాలయ్యా? అంజలిని అలా తోయడమేంటి? వాటర్ బాటిల్లో మద్యం ఏంటి? - video

కల్కి 2898AD ముగింపు 30 రోజుల్లో పూర్తికానుంది

డిస్ట్రిబ్యూటర్ నుంచి మహారాజ్ఞి తో నిర్మాత స్థాయికి ఎదిగిన అనిష్ దొరిగిల్లు

Kalki 2898 AD షూటింగ్‌.. కడుపుతోనే పాల్గొంటున్న దీపికా పదుకునే

ఇప్పటికీ డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతా - మోక్షజ్ఞ సినీమాలోకి వస్తాడు : నందమూరి బాలకృష్ణ

నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్

వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

తర్వాతి కథనం
Show comments