Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గన్నుకన్నా పెన్ను గొప్పది.. జగమంతటికీ జర్నలిస్టే బాధ్యుడు...

గన్నుకన్నా పెన్ను గొప్పది.. జగమంతటికీ జర్నలిస్టే బాధ్యుడు...
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:55 IST)
మావోయిస్టుల చేతిలో బందీగా ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వరి సింగ్ మన్హాస్‌ను విడిపించడంలో ఏడుగురు జర్నలిస్టులు బాధ్యత తీసుకున్నారు. విడుదలైన ఆ జవాన్‌ను బైక్‌పై బయటికి తీసుకు వచ్చిందీ జర్నలిస్ట్.

జర్నలిస్టులంటే అందరూ గౌరవిస్తారు. కష్టకాలంలో రాజకీయ నాయకులైనా, అధికారులు, వ్యాపారులు, ప్రజలు ఎవ్వరికైనా జర్నలిస్టు, మీడియానే గుర్తుకొస్తుంది. మాకు న్యాయం జరుగుతుందని జనం కూడా జర్నలిస్టులను కలుస్తారు. ఇప్పటికీ సమాజంలో జర్నలిస్టుల పట్ల మంచి అభిప్రాయం ఉంది. 
 
కానీ కొందరు మీడియా యాజమా న్యాలు, పాలకులు వీరికితోడు కొందరు జర్నలిస్టులు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు జర్నలిస్ట్ వ్యవస్థను వాడుకుని కరివేపాకులా పారేస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా కించపరుస్తున్నారు.
 
ఇప్పటికీ నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేవాళ్ళున్నారు. నీతి, నిజాయితీతో సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులున్నారు. పాలకులు, పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టులను ఆదుకోవాలి ఆదరించాలని జర్నలిస్టులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ప్లాంట్‌పై మాట్లాడే ధైర్యం దమ్మూ జగన్‌కు ఉందా?: చంద్రబాబు గర్జన