హైదరాబాదులో భారీగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 21 మే 2020 (06:27 IST)
లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత హైదరాబాదు నగరంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ఆపేసిన పోలీసులు, మద్యం విక్రయాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, ఇంతవరకూ వాటిని నిర్వహించలేదు.

సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను మూసి వేస్తుండటం, 7 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుండటమే దీనికి కారణం.

ఇక మొన్నటి నుంచి భారీ స్థాయిలో లాక్ డౌన్ సడలింపులు అమలులోకి రావడంతో అనుమానితులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

దీంతో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టిన ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, మాస్క్ లు లేకుండా బయటకు వచ్చిన వారిపైనా పోలీసులు కొరడా ఝళిపించారు.

మాస్క్ లేనివారిపై రూ. 1000 జరిమానా విధిస్తున్నామని, మంగళవారం నాడు జంట నగరాల పరిధిలో 395 మందిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

అకీరా నందన్‌కు ఊరట... ఏఐ లవ్ స్టోరీపై తాత్కాలిక నిషేధం

డా. ఎం. మోహన్ బాబు కు బెంగాల్ ప్రభుత్వ గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు ప్రారంభం, త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments