Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాను హడలెత్తిస్తున్న విష జ్వరాలు - పెరుగుతున్న డెంగీ కేసులు

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:43 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జ్వరాలతో ఆస్పత్రి వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెగిపోయింది. గత 10 రోజుల నుంచి వాతావారణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు వైరల్ ఫీవర్ భారీన పడుతున్నారు. 
 
దోమల బెడద కూడా తోడువడటంతో డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సాధారణ రోజుల్లో వచ్చే రోగలకంటే రెండు మూడు రెట్లు అధికంగా రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాలే కాదు. ప్రైవేట్ దవాఖానాల పరిస్థితి కూడా అలాగే ఉంది. హస్పిటల్ ఏదైనా సరే రోగుల మాత్రం పెరిగి పోతున్నారు. 
 
రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఓపీ ట్రీట్మెంట్ కొందరికి, తీవ్రతనుబట్టి హస్పిటల్‌లో మరికొందరిని చేర్చుకుని ట్రీట్ చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం డెంగీ లక్షణాలు కనిపిస్తే చాలూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవతున్నాయి. హైదరాబాద్‌లో 447, ఖమ్మంలో 134 కేసులు, రంగారెడ్డిలో 110 కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే 12 వందల కేసులు నమోదయ్యాయి. 
 
రెండేళ్ళ క్రితం ఈ సారి సైతం డెంగీ డేంజరస్‌గా విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో ఫీవర్ ఆస్పత్రి, నిలోఫర్, గాంధీ, ఉస్మానియాల్లోని ఓపీలు రోగుల క్యూలైన్లతో నిండిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైన మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments