Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ నోటీసులు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (14:42 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఓసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలకమైన వ్యక్తుల గృహాల్లో ఆకస్మిక సోదాలు చేశారు. శుక్రవారం రెండో దఫాలో ఏకంగా 40 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలకు దిగారు. ఇందులో హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 20కి పైగా ప్రాంతాలు ఉన్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవితకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. ఇప్పటికే ఆమె వ్యక్తిగత ఆడిటర్ నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఆ తర్వాత కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కరోనా వైరస్ బారినపడి హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నోటీసును ఆమె సహాయకుల ద్వారా కవితకు పంపించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాములో ఈడీ అధికారులు దూకుడుంగా వ్యవహరిస్తున్నారు. 
 
మరోవైపు, ఈడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్, నెల్లూరులతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. వీరిలో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 
 
హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ నివాసముంటున్నారు. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 
 
బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. అలాగే.. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ ఎమ్మెల్సీ క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments