తండ్రి అంత్యక్రియలు చేసేందుకు భిక్షాటన చేసిన కుమార్తె

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (22:49 IST)
కన్నతండ్రి పాముకాటుతో కన్నుమూసాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దానితో అతడి కుమార్తె జోలె పట్టి భిక్షాటన చేసింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద నాగుపాము కనిపించడంతో దుర్గయ్య అనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. దాంతో అతడు అక్కడికి వచ్చి పామును పట్టుకుని సంచిలో వేస్తుండగా అతడిని పాము కాటు వేసింది. దీనితో దుర్గయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

 
ఐతే మార్గమధ్యంలోనే దుర్గయ్య కన్నుమూశాడు. కూలి పనులు చేసుకుంటూ ఏరోజుకారోజు పొట్టపోసుకుని బ్రతుకుతున్న దుర్గయ్య చనిపోవడంతో అతడి అంత్యక్రియలు చేసేందుకు పిల్లల వద్ద పైసా లేకుండా పోయింది. దీనితో అతడి కుమార్తె, కొడుకు ఇద్దరూ గ్రామంలోని ప్రధాన వీధులలో తిరుగుతూ భిక్షాటన చేసారు. వచ్చిన డబ్బుతో తండ్రి అంత్యక్రియలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poorna: పూర్ణ నటించిన అతీంద్రియ అంశాలతో కూడిన డార్క్ నైట్ రాబోతోంది

Ritu Varma: గోపీచంద్ 33 సినిమాలో విల్లు ఎక్కుపెట్టిన సత్యవతిగా రీతువర్మ లుక్

Arya, Vaishnavi: ఆర్య తో వైష్ణవి చైతన్య, నిఖిల విమల్ రొమాన్స్ అదుర్స్

'ఉస్తాద్ భగత్ సింగ్‌'లో కెవ్వు కేక లాంటి స్పెషల్ సాంగ్? : హరీష్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: కాలర్ ఏయ్ ఎత్తరా అంటూ పాటతో అలరించనున్న పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments