వైసీపీ అంతర్గత పోరు.. ఏం మాటలు రా.. బాబోయ్!

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (21:49 IST)
వైసీపీ అంతర్గత పోరు పెరిగిపోతోంది. సొంతపార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు బాలినేని, కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
 
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు నడుస్తున్న వేళ అన్ని పార్టీలు ఇన్ డైరెక్టుగా ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఈక్రమంలో అధికార పార్టీ వైసీపీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. 
 
కానీ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనే వైసీపీలో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆధిపత్య పోరుతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నేతలు. 
 
క్రమశిక్షణ అనే మాట బహుశా వైసీపీ నేతలకు సెట్ అవ్వదంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నేతలు ఎక్కువగా అసభ్యపదజాలాలు ఉపయోగిస్తుంటారు.
 
ఓ పక్క ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్న అధికార వైసీపీకి సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ కు సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న నేతలు ఒకరి వెంట మరొకరు బయటికి వచ్చి తమపై సొంత పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుండటం సంచలనం రేపుతోంది.
 
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని సొంతపార్టీ వారే తనపై కుట్రలు చేస్తున్నారని.. సొంతపార్టీవారి నుంచే తనకు శత్రువులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments