తెలంగాణాలో కరోనా విశ్వరూపం - 50 వేలకు చేరువలో కేసులు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (22:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 1554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. మొత్తం 37,666 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 76.5 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 438కి పెరిగింది.
 
24 గంటల్లో నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధి నుంచి 842 కేసులు రావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈరోజు 1,281 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ఆంధ్రాలో కరోనా మరణ మృదంగం 
కరోనా మహమ్మారి దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకూ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాలకు సైతం కరోనా విస్తరిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 6,045 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
 
వీటిలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,049 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, గుంటూరు 842, కడప 229, కృష్ణా 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 672 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,713కి పెరిగింది.
 
గత 24 గంటల్లో కరోనా బారిన పడి మొత్తం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 15, కృష్ణలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరులో 5, కర్నూలులో 5, విజయనగరంలో 4, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 3, కడప, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది. మరిన్ని వివరాల కోసం కింది టేబుల్ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments