Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నాడు.. ఆరేళ్ల బాలుడు డిశ్చార్జి..

Webdunia
సోమవారం, 4 మే 2020 (22:12 IST)
హైదరాబాదులోని గాంధీ దవాఖానా నుంచి ఆరేళ్ల బాలుడు కరోనా రక్కసి చెర నుంచి బయటపడ్డాడు. సోమవారం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరి ద్వారా జైనూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకగా, తన నుంచి తన ఆరేళ్ల మనుమడికి అంటుకుంది. 
 
గత నెల 18న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. బాలుడు కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో మగ్గురు కోలుకున్నారు. మరో నలుగురు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం కొత్తగా 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం నమోదైన మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇంకా సోమవారం పూట 40మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా మొత్తం 585 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments