Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో 300మంది ఉగ్రమూకలు.. ఆగని దాడులు.. జవాన్ల వీరమరణం

Webdunia
సోమవారం, 4 మే 2020 (22:09 IST)
ప్రపంచ దేశాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రవాదులు మాత్రం జమ్మూకాశ్మీర్‌లో దాడులకు తెగబడుతున్నారు. హంద్వారా సెక్టార్‌లో ఉగ్రమూకలు దాడులకు దిగింది. ఈ సందర్భంగా ఉగ్రమూకలకు, జవాన్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడ్డ జవాన్లను ఆస్పత్రులకు తరలించామని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.
 
కాగా ఆదివారం జమ్ముకాశ్మీర్‌లోని కుశ్వారా జిల్లా హంద్వారా సెక్టార్‌లో ఉగ్రవాదులు దాడి చేసి కల్నల్‌ అశుతోష్‌ శర్మ సహా ఐదుగురు జవాన్లను కాల్చిచంపారు. విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే మళ్లీ ఉగ్రమూకలు రెచ్చిపోయారు. అదే హంద్వారా సెక్టార్‌లో మరోసారి దాడులకు దిగింది.
 
ఇకపోతే.. ఓ వైపు దేశం మొత్తం కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటే.. ఇదే అదనుగా ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. భారత్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సుమారు 300మంది ఉగ్రవాదులు ఉన్నారని ఇటీవలే ఇంటెలీజెన్స్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments