Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో 27 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 21 మే 2020 (09:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1661కు చేరాయి. 
 
అలాగే, ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 40కు చేరింది. బుధవారం ఇద్దరు రోగులు ఈ వైరస్ దెబ్బకు చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు 40 మంది చనిపోయారు. 
 
కాగా, ప్రస్తుతం 608 యాక్టివ్ కేసులు ఉండగా, 1013 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూనేవుంది.
 
ప్రైవేటుగా కరోనా పరీక్షలు 
కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేవలం గాంధీ, నిమ్స్‌లోనే కాకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 
 
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకునేందుకు అనేక మంది రోగులు వెనుకంజ వేస్తున్నారు. పైగా, కేవలం గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని అనుకోవడం భావ్యం కాదన్నారు. 
 
అంతేకాకుండా, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే... ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు... ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. 
 
ఆస్పత్రులు, ల్యాబ్‌లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను... ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే... కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments