Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో కొత్తగా ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!

Advertiesment
Telangana
ఉన్నత విద్యను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రుల ఉప సంఘం సిఫార్సు చేసింది. దీంతో ఐదు కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు కానున్నాయి. 
 
ఈ ఐదు వర్శటీల్లో మెదక్ జిల్లాలో వోక్స్‌సెన్ యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో మహీంద్రా యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్కేసర్‌లో అనురాగ్ విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ యూనివర్శిటీలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉరుమురిమి మంగలం మీద పడటం అంటే ఇదే కాబోలు...