Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడెంలోకి రానివ్వలేదనీ చెరువులో దూకిన విద్యార్థిని.. తర్వాత..

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా వైరస్ సోకలేదనీ వైద్యులు నిర్ధారించినప్పటికీ.. గ్రామస్థులు మాత్రం గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికిలోనై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పెద్దగోళ్ళగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దగోళ్ళగూడెంకు చెందిన ఓ యువతి మహారాష్ట్రలో అగ్రికల్చర్ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈమె నానా తంటాలుపడి కొత్తగూడెంకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఆ యువతి వద్దకు చేరుకుని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ అధికారులు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆ యువతిని ఆదేశించారు. అయితే, గూడెంవాసులు మాత్రం ఆ యువతిని గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ యువతి... చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువతిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments