దేశంలో ఫస్ట్ టైమ్.. కరోనా నుంచి విముక్తి పొందిన పసికందు

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:33 IST)
దేశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోరనా వైరస్ మహమ్మారి బారినపడిన చిన్నారులు, వృద్ధులు తిరిగి కోలుకునే అవకాశాలు చాలా తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల పదేళ్ళలోపు చిన్నారులు, 60 యేళ్లు పైబడిన వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ కేంద్రం కూడా ఆదేశాలు జారీచేసింది. కానీ, మన దేశంలో ఓ అద్భుతం జరిగింది. కరోనా వైరస్ బారినపడి ఓ చిన్నారి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇది సికింద్రాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 
 
ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 20 రోజుల (పసికందు) బాలుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ బాలుడిని ఏప్రిల్ పదో తేదీన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చి, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఆ తర్వాత ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చిన్నారికి చికిత్స అందిస్తూ వచ్చారు. 25 రోజుల చికిత్స తర్వాత ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న 20 రోజుల పసికందు ఇతనే కావడం గమనార్హం. 
 
కాగా, ఈ బాలుడికి అతని తండ్రి ద్వారా ఈ వైరస్ సోకింది. కానీ, ఇపుడు బాలుడు నుంచి తల్లికి ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరినీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments