ఆ పథకాలు తెస్తే కాంగ్రెస్ మటాషే... కేసీఆర్

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:50 IST)
ఇప్పటివరకూ ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయి. అవి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ మటాషే అని కేసీఆర్‌ మండిపడ్డారు. మరో మూడు టర్మ్‌లో టీఆర్‌ఎస్‌దే అధికారం అని చెప్పుకొచ్చారు.

ఆయుష్మాన్‌ కంటే ఆరోగ్య శ్రీ పథకం చాలా ప్రయోజనకరమని.. ఉద్యోగాల డిమాండ్ తప్పు అనడం లేదన్నారు. అయితే ఇంటికో ఉద్యోగం అనడం సరికాదని.. యువతను అనవసరంగా రెచ్చగొట్టొద్దని కాంగ్రెస్ నేతలు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘బీజేపీ ప్రభుత్వంలో హామీలే తప్ప నిధులు రావడం లేదు. కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. బీజేపీ ఏమీ ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తోంది. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు మోదీ మానుకోవాలి.

తెలంగాణ ఏర్పాటు డార్క్‌ డే అని అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడం సరికాదు. 60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. రాష్ట్రాన్ని ఎవరూ దానంగా ఇవ్వలేదు.

సరిహద్దు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు బీజేపీ ప్రభుత్వం కంటే టీఆర్‌ఎస్‌ పాలన గొప్పగా ఉంది. కిసాన్‌ సమ్మాన్‌ కంటే రైతుబంధు ఎన్నో రెట్లు ఉపయోగం ఉంది’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆదివారం నాడు అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. దుర్మార్గాలకు బ్రీడింగ్‌ సెంటర్‌ కాంగ్రెస్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌ నేతలు కుట్రలు ఆపడం లేదని.. ప్రాజెక్టులు, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు వేశారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని కాంగ్రెస్ మాట్లాడుతుండటం సిగ్గుచేట్టన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Janardhana: రౌడీ జనార్దన షూట్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రవి కిరణ్ కోల

Mrunal Thakur :అడివి శేష్ డెకాయిట్‌ లోని సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి రాబోతోంది

'బాక్సాఫీస్ కా బాప్' ఆదిత్య ధర్ : 'ధురంధర్‌' మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

బాబీ కొల్లి మెగాస్టార్ చిరంజీవి నటించే 158వ చిత్రం

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments